ఆంధ్రప్రదేశ్ లో సీఐజీఆర్ 13.49శాతం వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రానికి ఏటా కావాల్సిన ఆదాయం రూ.76వేల కోట్లు. గతేడాది 12.02శాతం వృద్ధి సాధించాం. కొన్ని జిల్లాల్లో వృద్ధి చాలా బాగుంది. కొన్ని జిల్లాల్లో వృద్ధి లేదు. వృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. దీర్ఘకాలం ప్రయోజనాల దృష్ట్యా పది సూత్రాలు తీసుకువచ్చాం. ఉపాధి కల్పనకు భవిష్యత్తులో చాలా ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర వృద్ధిరేటు 15 శాతం సాధించాలి. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. ఒక కుటుంబం - ఒక వ్యాపారవేత్త నినాదం తీసుకున్నాం. నైపుణ్యం పోర్టల్ ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఉపాధి కల్పనతో ఆదాయం సృష్టి జరుగుతుంది. మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఈ ఏడాది 35 శాతం క్రైమ్ రేటు తగ్గాలి. జిల్లాల్లో పరిస్థితుల మేరకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలి. అన్ని కార్యాలయాల్లో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి. రాయలసీమకు సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. అన్ని వాహనాలు ఎలక్ట్రిక్‌కు మారాల్సిన అవసరం ఉంది. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ భారం తగ్గుతుంది. సర్క్యులర్ ఎకానమీలో పోలీసు వ్యవస్థ భాగస్వామ్యం కావాలి'' అని సీఎం వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, ఎన్.ఎం.డీ ఫరూక్, సీఎస్, డీజీపీ సదస్సులో పాల్గొన్నారు.
రాష్ట్ర వృద్ధి రేటు 15శాతం సాధించాలి !
September 16, 2025
0
Tags