హైదరాబాద్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటో పెట్టి రూ.14.35 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. పెట్టుబడి పెట్టండి అధిక లాభాలు వస్తాయంటూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుకు సంతోష్‌నగర్‌కు చెందిన బాధితుడు ఆకర్షితుడయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఫొటో ఉండటంతో నమ్మి లింక్ క్లిక్ చేశాడు. తొలుత మెటల్ ట్రేడింగ్ లో రూ.12,600 పెట్టుబడి పెట్టిన బాధితుడు లాభాలు చూపించడంతో విడతలవారీగా రూ.14.35 లక్షలు పెట్టుబడి పెట్టాడు. లాభాలు ఇవ్వకపోగా మరో రూ.8 లక్షలు కడితే మొత్తం డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిర్మలా సీతారామన్ ఫొటో పెట్టి వృద్ధుడి నుంచి రూ.14.35 లక్షలు సైబర్ నేరగాళ్లు !
September 16, 2025
0
Tags