ఫ్లిప్‌కార్ట్ లో ఒప్పో కే13 ఎక్స్ 5G ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్ !

Telugu Lo Computer
0


ఫ్లిప్‌కార్ట్ ఒప్పో కే13 ఎక్స్ 5G ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది.  దీనిపై భారీ బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999కి ఉండగా, ఇప్పుడు రూ.11,999లకే లిస్ట్ అయింది. HDFC బ్యాంక్ కార్డ్ చెల్లింపుపై మరో రూ.1500 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత రూ.10,499కి అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.8,350 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1604 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆర్మ్ మాలి-G57 GPUతో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అందించారు. ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ OS 15పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 4GB / 6GB / 8GB RAM + 128GB / 256GB స్టోరేజ్ ఉన్నాయి. దీనిని మైక్రో SD ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. అలాగే 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని అందించారు. దీనిలో  50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)