మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన తన మామ పిచ్చిరెడ్డిని సాగనంపేందుకు భారీ డీల్ కుదుర్చుకున్నారు. పిచ్చిరెడ్డికి చెందిన 49% వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందు కోసం కృష్ణారెడ్డి అంతర్జాతీయ పెట్టుబడుల దిగ్గజ సంస్థ ఓక్ ట్రీ క్యాపిటల్ మేనేజ్ మెంట్ రూ. 10,000 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. దాదాపు 15 శాతం వడ్డీతో అప్పు ఇచ్చేందుకు సదరు సంస్థ అంగీకరించినట్లు తెలుస్తోంది. కృష్ణారెడ్డి, ఓక్ట్రీ సంస్థలు గత వారం ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద ఫైనాన్సింగ్ ఒప్పందాలలో ఇదొకటి కావడం గమనార్హం. కృష్ణారెడ్డి 2027 మార్చి నాటికి పి.పి. రెడ్డికి ఉన్న 49% వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఓక్ ట్రీ క్యాపిటల్ మేనేజ్మెంట్ నుంచి రూ. 10 వేల కోట్లు అప్పు తీసుకుంటున్న మేఘా కృష్ణారెడ్డి
September 29, 2025
0
Tags