దేశీయ మార్కెట్లో ఐటెల్ కంపెనీ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ZENO 20 ను విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, AI ఫీచర్స్, భారీ డిస్‌ప్లే, IP54 రేటింగ్ వంటి ఫీచర్లతో వినియోగదారులకు సులభమైన, ధృడమైన అనుభవాన్ని అందిస్తుంది. అంతే కాకుండా కేవలం రూ.5999కే స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. ZENO 20 IP54 రేటింగ్ తో వస్తుంది. దుమ్ము, నీటి నుండి రక్షణ కలిగిన ఫోన్. బాక్స్‌లో డ్రాప్-రెసిస్టెంట్ కేస్ కూడా ఉంటుంది, ఇది రోజువారీ వినియోగంలో ఫోన్‌ను బలంగా, నమ్మదగినదిగా చేస్తుంది. ఫోన్ T7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది. ఈ ఫోన్‌లో Aivana 2.0 AI వాయిస్ అసిస్టెంట్ ఉంది. వాయిస్ ఆదేశాలతో యాప్‌లు తెరవడం, కాల్స్ చేయడం, నోటిఫికేషన్లను చెక్ చేయడం వంటి పనులను సులభతరం చేస్తుంది. హిందీ కమాండ్లకు కూడా పూర్తి మద్దతు ఉంది. 6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లే ఉంది, 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్ అందిస్తుంది. DTS సౌండ్ టెక్నాలజీ సినిమాలు, పాటలు, గేమ్స్ కోసం అద్భుతమైన ఆడియో అనుభవాన్ని కల్పిస్తుంది. 3GB RAM + 64GB,4GB RAM + 128GB ఆప్షన్స్ లభిస్తుంది. వర్చువల్ RAMతో 8GB. ఇది మల్టీటాస్కింగ్‌ను సులభతరం చేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ తో స్మూత్‌గా పనిచేస్తుంది. 13MP HDR రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా. 5,000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బాక్స్‌లో 10W USB Type-C ఛార్జర్ వస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్, 3GB RAM + 64GB: రూ.5,999, 4GB RAM + 128GB: రూ.6,899. రెండు వేరియంట్లకు రూ.250-₹300 డిస్కౌంట్ కూపన్లు ఉన్నాయి. ఆగస్టు 25 నుండి అమెజాన్ ఇండియాలో అందుబాటులోకి వస్తాయి. స్టార్‌లైట్ బ్లాక్, స్పేస్ టైటానియం, ఔరోరా బ్లూ రంగుల్లో లభిస్తుంది.
ఐటెల్ ZENO 20 స్మార్ట్‌ఫోన్ విడుదల
August 23, 2025
0
Tags