సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేసి విష్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పై రజినీకాంత్ స్పందిస్తూ నా సోదరుడు, పొలిటికల్ తుఫాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు ఉప్పొంగిపోయాను. మీ మాటలు గౌరవంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు రజినీకాంత్. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. రజినీకాంత్ ట్వీట్ మీద పవన్ కల్యాణ్ మళ్లీ స్పందించారు. మై డియర్ బిగ్ బ్రదర్, మీ మాటలు నా మనసును తాకాయి. మీ ప్రేమ, ఆశీస్సులకు స్పెషల్ థాంక్స్. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ పవన్ కల్యాణ్ తెలిపారు. ఇలా బిగ్ స్టార్స్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ మాటలకు ఉప్పొంగిపోయాను : రజినీకాంత్ ట్వీట్
August 17, 2025
0
Tags