తుంగభద్రకు తగ్గుముఖం పట్టిన వరద నీరు

Telugu Lo Computer
0


ర్షాలు తగ్గుముఖం పట్టడంతో రెండు, మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన తుంగభద్ర శనివారం కాస్త శాంతించింది. జలాశయం నుంచి నదికి నీరు విడుదల తక్కువ కావడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కంప్లి కోట వద్ద బ్రిడ్జిని తాకుతున్న నీరు తగ్గుముఖం పట్టింది. కోట వద్ద ఆంజనేయస్వామి దేవస్థానంలో నీరు తగ్గుముఖం పట్టింది. నదికి నీరు పోటెత్తడంతో మత్స్యకారులు తెప్పలను గట్టుకు చేర్చారు. ఈ ఏడాది గత మూడు నాలుగు సార్లు నదికి నీరు పోటెత్తడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లాలన్నా తెప్పలపైన వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి జలాశయం పై భాగంలో వర్షాలు తక్కువ కావడంతో నదికి నీరు కూ డా వరద తక్కువైంది. కంప్లి వంతెనపై ఇంకా వాహనాలను అనుమ తించడంలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)