మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

Telugu Lo Computer
0


తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో న్యాయస్థానం క్రిమినల్ కేసుకు ఆదేశించింది. ఈ నెల 21 లోపు నిందితురాలికి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)