తెలంగాణ ప్రభుత్వ మోడల్‌ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఇటీవల 2025-26 విద్యా సంవత్సరానికి మోడల్‌ స్కూల్స్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహించారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినా దాదాపు 48 వేలకు పైగా సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్స్‌లో 48,630 సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. అత్యధికంగా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 13,256 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 12,668 సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆరో తరగతికి సంబంధించి 7,543 సీట్లు, ఏడో తరగతిలో 5,192 సీట్లు, 8వ తరగతి 3,936 సీట్లు, 9వ తరగతి 2,884 సీట్లు, పదో తరగతిలో 3,151 సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మోడల్ స్కూల్స్‌లో సీట్లు కావాలనుకునే వారు నేరుగా పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్‌ను కలవాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)