వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ ఫ్రాడ్ ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు

Telugu Lo Computer
0


వాట్సాప్ లో సరికొత్త మోసానికి సైబర్ కేటుగాళ్లు తెరతీశారు. వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ ఫ్రాడ్ ద్వారా కేటుగాళ్లు బ్యాంకు ఖాతాను ఖాళీ చేయడంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా తస్కరిస్తారని వన్ కార్డ్ హెచ్చరిస్తుంది.ఈ స్కామ్ లో సైబర్ కేటుగాళ్లు బాధిత వ్యక్తిని నమ్మించేందుకు తొలుత ఏదైనా బ్యాంక్ లేదా కంపెనీ ఉద్యోగినంటూ కాల్ చేస్తారు. ఆ పై మీ అకౌంట్లో సమస్య ఉందని, వాట్సాప్ స్క్రీన్ షేర్ చేయమని అడుగుతారు. అలా ఓటీపీలు, పాస్ వర్డ్స్, పర్సనల్ మెసేజ్ లు వంటి సమాచారాన్ని తీసుకుని బ్యాంక్ అకౌంట్ ను ఖాళీ చేస్తారు. మొబైల్ లో మనకు తెలియకుండానే కీలాగర్ లేదా కీబోర్డ్ లాగర్ ఇన్ స్టాల్ చేస్తారు. అక్కడ ఏం టైప్ చేస్తున్నారో చూసేందుకు ఈ సాఫ్ట్వేర్ ను వాడుతారు. కీబోర్డ్ లాగర్ ద్వారా బ్యాంకింగ్ పాస్ వర్డ్స్, సోషల్ మీడియా పాస్ వర్డ్స్ అన్నింటినీ దొంగిలించవచ్చు. ఓటీపీలు, యూపీఐ పిన్ నంబర్లు, పర్సనల్ మెసేజ్లు, ఐడీ ప్రూఫ్ లను కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు.  కాబట్టి ఏదైనా అన్ నౌన్ నంబర్ నుంచి కాల్స్ వచ్చినా, వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ అడిగినా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు కాల్ చేసి లేదా https://cybercrime.gov.Inలో ఫిర్యాదు చేయవచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)