తిరుమల శ్రీవారిని కోలీవుడ్ హీరో జయం రవి దర్శించుకున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ గా భావిస్తోన్నసింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . తన భార్య ఆర్తితో విడాకుల వివాదం తర్వాత వీరిద్దరు జంటగా పలుసార్లు కనిపించారు. జయం రవి సొంత నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముందుతిరుమల ఆలయాన్నిసందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వీరిద్దరు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నైలో జయంరవి తొలి నిర్మాణ సంస్థ రవి మోహన్ స్టూడియోస్‌ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు జయం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గణేష్ కె బాబు దర్శకత్వం వహించిన 'కరాటే బాబు', సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి'లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా తన భార్య ఆర్తితో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచారు. వీరిద్దరు విడిపోవడానికి సింగర్ కెనీషా ప్రమేయం ఉందని వార్తలొచ్చాయి. నటుడు గణేష్ కుమార్తె వివాహంలో చేతులు పట్టుకుని కనిపించడంతోరూమర్స్ మరింత ఊహందుకున్నాయి.
తిరుమలలో సింగర్ కెనీషాతో జయం రవి : సోషల్ మీడియాలో వైరల్ !
August 25, 2025
0
Tags