పేటీఎం నుంచి యాంట్ గ్రూప్ పూర్తిగా వైదొలగనుంది. పేటీఎంలో ఉన్న మిగిలిన 5.4 శాతం వాటాను బ్లాక్‌డీల్ ద్వారా పూర్తిగా విక్రయించనుంది. గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా సేల్ నిర్వహించనున్నాయి. మంగళవారం జరగబోయే ఈ బ్లాక్‌డీల్‌లో భాగంగా ఒక్కో షేరు ఫ్లోర్‌ప్రైస్‌ను రూ.1020గా నిర్ణయించినట్లు తెలిసింది. దీని విలువ సుమారు రూ.3,845 కోట్లుగా ఉండబోతోంది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి పేటీఎం షేరు విలువ రూ.1078.20తో పోలిస్తే 5.4 శాతం డిస్కౌంట్‌కే షేర్ల విక్రయం జరగనుంది. పేటీఎం మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌లో గడిచిన రెండేళ్లలో పలు సంస్థలు తమ వాటాలను విక్రయించాయి. వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ తమ వాటాలు విక్రయించాయి. అలీబాబాకు చెందిన యాంట్ గ్రూప్ కూడా 2023 ఆగస్టులో 10.3 శాతం వాటాను, ఈ ఏడాది మే నెలలో 4 శాతం వాటాను విక్రయించింది. తాజాగా మిగిలిన వాటానూ విక్రయించబోతోంది. దీనిపై అటు పేటీఎం గానీ, యాంట్ గ్రూప్ గానీ స్పందించలేదు.
పేటీఎం నుంచి పూర్తిగా వైదొలగనున్న యాంట్ గ్రూప్ !
August 04, 2025
0
Tags