అమరావతిలో కన్వెన్షన్‌ సెంటర్‌కు హడ్కో బోర్డు ఆమోదం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హడ్కో కన్వెన్షన్‌ సెంటర్‌కు హడ్కో బోర్డు ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ లేఖ రాశారు. గుంటూరులో సీఆర్‌డీఏ కేటాయించిన 8 ఎకరాల కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపింది. మరో రెండెకరాలు కూడా సీఆర్‌డీఏ కేటాయించాల్సి ఉందని హడ్కో తెలిపింది. ఒక్కో ఎకరం రూ.4 కోట్లకు కొనుగోలుకు బోర్డు ఆమోదించింది. మొత్తం 10 ఎకరాల్లో హడ్కో కన్వెన్షన్‌ సెంటర్ అభివృద్ధి అనుమతులకు ఆమోదం లభించింది. ఈ మేరకు 'ఎక్స్‌' వేదికగా కేంద్రమంత్రి పెమ్మసాని వివరాలు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)