తెలంగాణలోని మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి మార్కెట్ ప్రాంతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మురళి ఇంట్లో మొబైల్‌షాపుతో పాటు రెండు పూల దుకాణాలు ఉన్నాయి. రాత్రి వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కుప్పకూలింది. భవన శకలాలు ఎగిరి పడి ఎదురుగా ఉన్న మరో దుకాణం షట్టర్ ధ్వంసమయ్యింది. భవన శకలాలు తగలడంతో వీధిలో వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఇతని వివరాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వృద్ధురాలు తిరుపతమ్మతో పాటు, రఫిక్, దినేష్‌లకు గాయాలయ్యాయి వీరిని 108లో కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం : ఒకరి మృతి
August 05, 2025
0
Tags