పని విధానాలకు అంగీకరిస్తే వేతనాల పెంపునకు నిర్మాతలు సుముఖం !

Telugu Lo Computer
0


సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. నిర్మాతలు, ఫెడరేషన్‌ నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, మరో రెండు, మూడు సార్లు చర్చలు జరగాల్సి ఉందన్నారు. పని విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ''వేతనాలు పెంచాలని గత కొద్దిరోజులుగా ఫెడరేషన్‌ వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, నిర్మాతల నుంచి కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యంగా 2018, 2022లలో జరిగిన అగ్రిమెంట్స్‌లో ఉన్న రెండు షరతులను వాళ్లు అమలు చేయడం లేదు. ముందు వాటిని ఒప్పుకోవాలి. వీటితో పాటు మరో రెండు షరతులు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఛాంబర్‌ ద్వారా వాళ్ల దృష్టికి తీసుకొచ్చాం. వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే, వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నాం. రూ.2వేలు కన్నా తక్కువ వేతనం తీసుకునే వారికి ఒక పర్సంటేజీ ఆఫర్‌ చేస్తున్నాం. దాని కన్నా ఎక్కువ వేతనం తీసుకునే వాళ్లకు మరొక పర్సంటేజీ ఇవ్వాలని ప్రతిపాదించాం. ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్‌లతో మాట్లాడుకుని వస్తే, దీనిని పరిష్కరిస్తాం. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో అన్ని అంశాలను చర్చించాం. ప్రస్తుతం సానుకూల ధోరణిలో చర్చలు జరుగుతున్నాయి'' అని దిల్‌రాజు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)