ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్ష సూచన

Telugu Lo Computer
0


డిశా-ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అల్పపీడనం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు చెప్పారు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాకు ఆరెంజ్‌ అలెర్ట్‌, ఆదివారం విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిణి సుధా వల్లీ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)