చెప్పులు, శరీరంలో బంగారం దాచిన జంటను అరెస్టు చేసిన చెన్నై విమానాశ్రయ అధికారులు

Telugu Lo Computer
0


చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కౌలాలంపూర్‌ నుంచి చైన్నై వచ్చిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో బయటికి వెళ్లే క్రమంలో ఓ జంటను చూడగానే అధికారులకు అనుమానం కలిగింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో వారి సమాధానాలు విని అనుమానం మరింత బలపడింది. ఆ దంపతులు తమ చెప్పులు, శరీరంలో బంగారం దాచినట్లు గుర్తించారు. దాని విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు సదరు దంపతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు భారీగా కొకైన్‌ను సీజ్ చేశారు. ఏఐయూ, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 2 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ రాజధాని దోహా నుంచి చైన్నై వచ్చిన విమానంలో ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా.. అధికారులకు ఓ నైజీరియన్ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. 30 ఏళ్ల నైజీరియన్ మహిళ ఆఫ్రికా నుంచి దోహా మీదుగా చైన్నైకి వచ్చినట్లు తెలిసింది. దీంతో అనుమానం వచ్చి.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె వస్తువులను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా నల్ల రంగులో ఉన్న ప్యాకెట్లు బయటపడ్డాయి. అందులో చూడగా కొకైన్ బయటపడింది. దీని విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ కేసులో నైజీరియా మహిళకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. వీరికి చెన్నైలో ఏదైనా ముఠాతో సంబంధం ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)