వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్‌ రాజేశ్‌ అరెస్టు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పరిధిలోని తుర్కయాంజల్‌కు చెందిన ఓ వ్యక్తికి 200 గజాల స్థలం ఉంది. ఆ స్థలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేశ్‌ను సంప్రదించారు. ప్లాటు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేయగా రూ. 70వేలకు బేరం కుదిరింది. దీనిపై ప్లాటు యజమాని ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. శుక్రవారం రూ.70వేలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్‌ రమేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని విచారించగా సబ్‌రిజిస్ట్రార్ సూచన మేరకే డబ్బులు తీసుకున్నట్లు తెలిపాడు. ఏసీబీ అధికారులు సబ్‌రిజిస్ట్రార్ రాజేశ్‌తో పాటు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)