నలుగురు అదనపు జడ్జిలకు పదోన్నతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు అదనపు న్యాయమూర్తులకు పదోన్నతి లభించింది. జస్టిస్‌ హరనాథ్‌ నూనెపల్లి, జస్టిస్‌ కిరణ్మయి, జస్టిస్‌ సుమతి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌లకు పూర్తి స్థాయి జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు వెలువరించింది. ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లోని 16 మంది హైకోర్టు జడ్జిలకు పదోన్నతి కల్పించాల్సిందిగా సుప్రీం కోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసింది. అందుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో తాజాగా కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)