పోలీసు స్టేషన్‌లో కొట్టుకున్న మహిళ, లేడీ పోలీసు కానిస్టేబుల్ : వీడియో వైరల్

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్ లోని ఆగ్రా కాలింది విహార్ ప్రాంతానికి చెందిన సర్జు యాదవ్ ఒక కేసుకు సంబంధించి న్యాయం కోరుతూ ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ పోలీసులు బాధితురాలికే రివర్స్ లో బెదిరింపులకు గురిచేసేలా మాట్లాడారు. దీంతో సహానం నశించి పోయిన ఆమె పోలీసుల్ని కేసుపై సీరియస్ గా మాట్లాడింది. దీంతో వారు తమకే రివర్స్ లో మాట్లాడతావా అంటూ ఆమెపై దాడి చేశారు. ఈ క్రమంలో లేడీ పోలీసు కానిస్టేబుల్, మహిళ పరస్పరం దూశించుకుంటూ దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను స్టేషన్ నుంచి బైటకు పంపించి వేశారు. అయితే సదరు మహిళ ఒక సెల్పీ వీడియోను రిలీజ్ చేసింది. తనపై పీఎస్ లో ఇష్టమున్నట్లు దాడులు చేసి కొట్టారని, బట్టలు చింపేశారని, పురుషులు సైతం తనపై చేయి చేసుకున్నారని మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు న్యాయం జరక్కపోతే.. సూసైడ్ చేసుకుంటానని చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. అది కాస్త వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. ఘటనపై కొంత మంది అధికారుల్ని సస్పెండ్ చేశారు. మొత్తంగా ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)