ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కుప్పం మండలం పరమసముద్రం చెరువు వద్ద హంద్రీనీవా జలాలకు సీఎం జలహారతి ఇచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూలు చేసుకోనున్నారు. సాయంత్రం పర్యటనను ముగించుకొని బెంగుళూరు విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లనున్నారు.
హంద్రీనీవా జలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి !
August 30, 2025
0
Tags