గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్‌ను ఎంపిక చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు చోటు లభించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు కేబినెట్‌లో తీర్మానించి గవర్నర్‌కు పంపింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా అనూహ్యంగా ప్రభుత్వంఎంపిక చేసింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్, అజారుద్దీన్
August 30, 2025
0
Tags