హైదరాబాద్ మియాపూర్‌లో పొట్ట కూటి కోసం హైదరాబాద్ కు వలస వచ్చిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఐదుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి నుంచి హైదరాబాద్ కు వలస ఓ కుటుంబం వచ్చింది. మక్త మహబూబ్‌పేటలో నివాసం ఉంటున్న ఈ కుటుంబ సభ్యులు అనుమాస్పద స్థితిలో మరణించారు. మృతులలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటంతో అత్యంత విషాదకరం. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పసికందును చంపేసి మిగిలిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లేదా ఎవరైనా చంపేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో కుటుంబం సభ్యులు మృతి
August 21, 2025
0
Tags