బ్రిటన్‌ 'డిపోర్ట్‌ నౌ.. అపీల్‌ లేటర్‌' జాబితాలో భారత్‌ !

Telugu Lo Computer
0


బ్రిటన్‌ తమ దేశంలో నేరం చేసి శిక్ష పడ్డ విదేశీయులను స్వదేశానికి తిప్పి పంపేందుకు బ్రిటన్‌ అనుసరిస్తున్న 'డిపోర్ట్‌ నౌ, అపీల్‌ లేటర్‌' విధానంలోకి భారత్‌ కూడా చేరింది. ఈ విధానం ప్రకారం శిక్ష పడ్డ విదేశీ నేరస్థులను వారి అపీళ్లపై విచారణ ప్రారంభం కాకముందు స్వదేశానికి తరలిస్తారు. ఇందుకు ముందు ఈ విధానం ఐదు దేశాలకు బ్రిటన్‌ అమలు చేసింది. ఇప్పుడు ఈ సంఖ్యను 23కి పెంచింది. ఇందులో భారత్‌ కూడా ఉంది. గతంలో విదేశీ నేరగాళ్లకు తమ కోర్టులు శిక్షలు విధించినా, అపీళ్ల సాకుతో వారు నెలలు, ఏళ్లతరబడి బ్రిటన్‌లో ఉండిపోయేవారనీ, దానివల్ల ఎంతో ప్రజా ధనం వ్యయమయ్యేదనీ, ఇక దీనికి తెరదించుతామని హోం మంత్రి యీవెట్‌ కూపర్‌ వివరించారు. విదేశీ ఖైదీల మానవ హక్కుల క్లెయిములను తమ ప్రభుత్వం నిరాకరిస్తే, వారు స్వదేశం నుంచి వీడియోగ్రఫీ ద్వారా అపీలు ప్రక్రియలో పాల్గొనవచ్చని తెలిపారు. అనుమతులేవీ లేకుండా ద్విచక్ర వాహనాలపై సరుకుల అందజేత సిబ్బందిగా పనిచేస్తున్న వందలాది మందిని బ్రిటన్‌ అధికారులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు భారతీయులూ ఉన్నారు. గత నెల 20 నుంచి 27 వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో అనుమతులు లేకుండా పనిచేస్తున్న 1,780 మందిని అడ్డుకున్నామని, అక్రమంగా పనిచేస్తున్న 280 మంది వలసదారులను, శరణార్థులను అరెస్టు చేశామని బ్రిటన్‌ హోం శాఖ కార్యాలయం ప్రకటించింది. ఈ దాడుల సందర్భంగా పశ్చిమ లండన్‌లోని హిల్లింగ్డన్‌లో ఏడుగురు భారతీయుల్ని అరెస్టు చేశామని, ఇందులో ఐదుగురు అనుమతులు లేకుండా పనిచేస్తున్నట్టు గుర్తించామని హోం శాఖ అధికారులు తెలిపారు. ''అనుమతులు లేకుండా పనిచేసేవారి వల్ల మన దేశ సరిహద్దులకు ప్రమాదం. అందుకే అటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం'' అని బ్రిటన్‌ సరిహద్దు భద్రత, శరణార్థుల మంత్రి యాంజెలా ఈగల్‌ అన్నారు. అక్రమ వలసల్ని కట్టడి చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ కంపెనీలు నియమించుకునే సిబ్బంది పనిచేసేందుకు అనుమతి కలిగివున్నారా? లేదా? అన్నది పరిశీలించాలని కోరుతోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)