మంగళగిరి లోని తెలుగు దేశం పార్టీ కేంద్ర పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పలువురికి ఆర్థిక సాయం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. వైయస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు. ఈసారి అరాచకాలు జరగలేదనే అసహనంతో జగన్ ఉన్నారు. ఆయన వైఖరి ఏలాంటిదో ప్రజలకు తెలిసిందే. నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితి నుంచి 11 మంది పోటీ చేశారు. రెండు పోలింగ్ బూత్‌ల్లో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా? శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి కనుకే ప్రజలు ధైర్యంగా ఓటేశారని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పలువురు మరణించడం బాధాకరమన్నారు. నష్ట నివారణకు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో సంబంధిత మంత్రులు సమన్వయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
వైయస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు : చంద్రబాబు
August 13, 2025
0
Tags