గత ఆరేళ్లుగా తన తండ్రి హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నా : సునీతా రెడ్డి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి దంపతులు గురువారం ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిశారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన పరిణామాలతో ఆయనతో మాట్లాడారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి వివేకానందరెడ్డి గొడ్డలి పోటు కారణంగా పడి ఉంటే, గుండెపోటు అని తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే తన తండ్రి వివేకానందరెడ్డి హత్య గుర్తోస్తోందని చెప్పారు. తన తండ్రి గొడ్డలి పోటుతో చనిపోతే పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచివేశారని అన్నారు. హత్య తర్వాత తన తండ్రిని ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవిలు హత్య చేశారని రాసి ఉన్న లెటర్ తీసుకొచ్చి సంతకం చేయమంటే తాను చేయలేదని తెలిపారు. అప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారని, ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని సునీత ఆరోపించారు. అప్పుడు తన తండ్రిని టీడీపీ నేతలు చంపారని నమ్మ పలికారని, ఇప్పుడు తమ బంధువైన సురేష్‌పై దాడి జరిగిందని, అతనిపై ఎంపీ అవినాష్ అనుచరులు దాడి చేయించారన్న అనుమానం ఉందని ఆరోపించారు. గత 6 ఏళ్ళుగా తన తండ్రి హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నామని తెలిపారు. ఇంత వరకు దోషులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నను తాను, రాజశేఖర్ రెడ్డి కలిసి హత్య చేయించారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. హత్య కేసు నిందితులు బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు తన తండ్రి వివేకానందరెడ్డి జయంతి అని, కానీ తనని తన తల్లి పులివెందులకు రావద్దని చెప్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సి న పరిస్థితి ఉందని అన్నారు. అయితే ఖచ్చితంగా న్యాయం గెలుస్తోందని పేర్కొన్నారు. తన మీద, తన భర్త మీద కేసులు పెడుతున్నారని అయితే బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)