ఆంధ్రప్రదేశ్ లో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌

Telugu Lo Computer
0


గణేశ్‌ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేశ్‌ను కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల గణేశ్‌ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడానికి రూ. 25 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని కోట్లాది గణేశ్‌ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేశ్‌ చేసిన వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)