సెప్టెంబర్ నెలలో సూర్య, చంద్ర గ్రహణాలు

Telugu Lo Computer
0


సెప్టెంబర్​ నెలలో పలు పండుగలతో పాటు అదే నెలలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడబోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భాద్రపద మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున (సెప్టెంబర్​ 7) సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం రాత్రి 9:58కి మొదలై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. గ్రహణ వ్యవధి మొత్తం 3.28 నిమిషాలు. సెప్టెంబర్ 7 రాత్రి 11:42 గంటలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడడు. సంపూర్ణ చంద్ర గ్రహణం సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26కు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుంది. పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 న రాత్రి 10.59 గంటల నుంచి తెల్లవారుజామున 3:23 గంటల వరకు ఏర్పడనుంది. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సూర్య గ్రహణం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ తదితర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు.

Post a Comment

0Comments

Post a Comment (0)