బంజారాహిల్స్‌లో రోడ్డు కుంగి గుంతలో పడిన వాటర్ ట్యాంకర్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1/12లో రోడ్డు కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు కుంగడంతో అటుగా వస్తున్న వాటర్ ట్యాంకర్‌ అందులో పడిపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్‌ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షం కారణంగానే రోడ్డు కుంగినట్లు అధికారులు చెబుతున్నారు. కుంగిన చోట రోడ్డు కింద నాలా పైప్‌లైన్‌ ఉన్నట్లు గుర్తించారు. రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాన్ని తొలగించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)