భారతదేశంలో ఓపెన్ ఏఐ తన మొదటి కార్యాలయాన్ని ప్రారభించడానికి సిద్ధమైంది. అకౌంట్ డైరెక్టర్, డిజిటల్ నేటివ్స్, అకౌంట్ డైరెక్టర్, లార్జ్ ఎంటర్‌ప్రైస్, అకౌంట్ డైరెక్టర్, స్ట్రాటజీస్ జాబ్స్ కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలు ఢిల్లీ, ముంబై లేదా బెంగళూరులో ఉండవచ్చు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఓపెన్ఏఐ కెరీర్ పేజీలో అప్లై చేసుకోవచ్చు. మా మొదటి ఆఫీస్ ప్రారభించడం, దీనికోసం స్థానికంగా ఒక టీమ్ ఏర్పాటు చేసుకోవడం అనేది లేటెస్ట్ ఏఐను మరింత అందుబాటులోకి తీసుకురావడం. భారత దేశంలో ఏఐను నిర్మించడానికి మా నిబద్దతతో మొదటి అడుగు అని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా సెప్టెంబర్‌లో భారత దేశాన్ని సందర్శించడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని అన్నారు. భారత దేశంలో ఆఫీస్ ప్రారభించడం అనేది ప్రభుత్వ ఇండియా ఏఐ మిషన్‌కు ఓపెన్ఏఐ మద్దతులో భాగం. కంపెనీ ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు, విద్యావేత్తలు, డెవలపర్లు, నిపుణులకు మెరుగైన సేవలందించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ ప్రారంభించి మరింత అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగానే ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థ సిద్ధమైంది.
దేశంలో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించడానికి సిద్ధమైన ఓపెన్ ఏఐ
August 25, 2025
0
Tags