ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియాకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. దేవాదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. భూగర్భజల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి కూడా ఎపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో జాబ్ నోటిఫికేషన్లను పొందుపరిచామని ఎపీపీఎస్సీ కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు.
మూడు నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
August 13, 2025
0
Tags