ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయంలో ఆన్‌లైన్ పూజల పేరిట భక్తులను మోసం చేస్తున్న ఓ నకిలీ వెబ్‌సైట్‌ను పోలీసులు గుర్తించారు. శ్రీక్షేత్రంలో ప్రత్యేక పూజలు, దర్శనం, నైవేద్య సమర్పణ తదితర సేవలు అందిస్తామంటూ తప్పుడు ప్రకటనలతో ఆ వెబ్‌సైట్ రూ.వేలల్లో దోపిడికి పాల్పడుతోందని పూరీ ఎస్పీ ప్రతీక్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం గుట్టు రట్టు కావడంతో.. సైబర్ బృందాన్ని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఆ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసి, కేసు దర్యాప్తునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
పూరీ జగన్నాథ ఆలయం పేరిట నకిలీ వెబ్‌సైట్
August 31, 2025
0
Tags