దేశీయ మార్కెట్లో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G అడుగుపెట్టబోతోంది. ఇది ఇప్పటికే విడుదలైన Hot 60i 4G వెర్షన్‌కు 5G అప్‌గ్రేడ్ వేరియంట్‌గా రానుంది. కొత్త మోడల్ ఫ్లిప్‌కార్ట్ మరియు ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయించబడుతుంది. షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, స్లీక్ బ్లాక్, ప్లమ్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. హారిజాంటల్ కెమెరా మాడ్యూల్ డిజైన్, డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 50MP ప్రైమరీ సెన్సార్, డ్యుయల్ LED ఫ్లాష్, HDR, పానోరమా మోడ్ సపోర్ట్ తో వస్తుంది. MediaTek Dimensity 6400 SoC ప్రాసెసర్,5G కనెక్టివిటీకి అనుకూలం. మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ & వేగవంతమైన పనితీరు కనబరుస్తుంది. 6,000mAh భారీ బ్యాటరీ వుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇంత పెద్ద బ్యాటరీని అందించిన మొదటి 5G ఫోన్ అని కంపెనీ చెబుతోంది. IP64 రేటింగ్ - డస్ట్ మరియు స్ప్లాష్ నుండి రక్షణ.
త్వరలో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G విడుదల
August 09, 2025
0
Tags