సెప్టెంబర్ 6న విన్‌ఫాస్ట్ విఎఫ్‌ 6, ఎఫ్‌ 7 కార్ల విడుదల

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లోకి వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్  అడుగుపెట్టనుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఈ సంస్థ తన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కూడా ఇటీవలే ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు భారత మార్కెట్‌లో ఈవీ కార్లను సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి విన్‌ఫాస్ట్ సిద్ధమవుతోంది. అదే రోజున వాటి అధికారిక ధరలను కూడా ప్రకటిస్తారు. లాంచ్‌కు ముందే ఈ కార్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తొలి దశలో విన్‌ఫాస్ట్ విఎఫ్‌ 6,  విన్‌ఫాస్ట్ విఎఫ్‌ 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను విడుదల చేయనుంది. ఈ రెండు కార్లను గత జనవరిలో జరిగిన 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఆ తర్వాత జులైలో ఈ రెండు కార్లకు బుకింగ్‌లు ప్రారంభించారు. విన్‌ఫాస్ట్ విఎఫ్‌ 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 70.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారు ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ అనే రెండు ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ మోడల్ 450 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని అంచనా. అలాగే, ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ 431 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. విన్‌ఫాస్ట్ విఎఫ్‌ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విలో 59.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 480 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదు. ఈ రెండు కార్లపైన భారత కస్టమర్లలో భారీ అంచనాలు ఉన్నాయి. సరైన ధర నిర్ణయంతో వీటికి మంచి స్పందన లభించే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)