ఉక్రెయిన్‌పై రష్యా దాదాపు 500కు పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. తమ దేశంలోని పశ్చిమ ప్రాంతాలపై మాస్కో దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మాస్కో-కీవ్‌ల యుద్ధం ముగింపు కోసం ట్రంప్.. పుతిన్, జెలన్‌స్కీలతో వేరువేరుగా చర్చలు జరిపారు. ఈ రెండు దేశాలు యుద్ధానికి ముగింపు పలుకుతాయని ప్రపంచం అనుకుంటుంటే ఈ దాడి జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఏడాది ఇదే అతి పెద్ద దాడి తమ దేశంలోని పశ్చిమ ప్రాంతాలు లక్ష్యంగా చేసుకొని రష్యా దాదాపు 574 డ్రోన్లు, 40 క్షిపణులతో విరుచుపడిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఈ ఏడాది మాస్కో చేసిన వైమానిక దాడుల్లో ఇదే అతి పెద్దదని పేర్కొంది. స్థానిక అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది గాయపడ్డారని తెలిపారు. పశ్చిమ ఉక్రెయిన్ లోని ప్రధాన అమెరికన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా పేర్కొన్నారు. కానీ ఆయన దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఉక్రెయిన్‌పై 500కు పైగా డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా
August 21, 2025
0
Tags