వివో టీ సిరీస్‌లో వివో టీ4 ప్రో పేరిట మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. 50 ఎంపీ కెమెరా, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో వస్తోంది. ఇందులో 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌రేటు, 5,000 నిట్స్ లోకల్, 1,500 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15తో పనిచేస్తుంది. ఫోన్ వెనకభాగంలో 50 ఎంపీ సోనీ IMX882 ప్రధాన కెమెరా, 50 ఎంపీ సోనీ IMX882 టెలిఫొటో కెమెరా, 2 ఎంపీ బొకే కెమెరా ఇచ్చారు. 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో తీసుకొచ్చారు. ఇది 6,500 ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్లేజ్ గోల్డ్, నిట్రో బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. వివో టీ4 ప్రో మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.27,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.29,999 కాగా.. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.31,999గా పేర్కొంది. వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంకులతో పాటు కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.3 వేల వరకు రాయితీ పొందొచ్చని వివో తెలిపింది. అలాగే రూ.3వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందొచ్చు. ఆగస్టు 29 నుంచి దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కొన్ని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.
వివో టీ4 ప్రో స్మార్ట్ ఫోన్‌ను విడుదల
August 26, 2025
0
Tags