నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆధారంగా యురేనస్ గ్రహంపై ఉన్న గుర్తించింది. ఇది 29వ చంద్రుడు అని నాసా తెలిపింది. దీనికి ఎస్/2025 యూ1 అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 2వ తేదీన సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ చంద్రుడిని గుర్తించినట్లు నాసా వెల్లడించింది. ఈ చంద్రుడి వ్యాసం కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని అంచనా వేశారు. అలాగే దాదాపు 56,000 కిలోమీటర్ల దూరంలో గ్రహం చుట్టూ తిరుగుతున్నట్లు పరిశోధక బృందం గుర్తించింది. సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సౌర వ్యవస్థ సైన్స్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ విభాగంలోని ప్రధాన శాస్త్రవేత్త మరియమ్ ఎల్ మౌతామిడ్ మాట్లాడుతూ ఇది ఒక చిన్న చంద్రుడు. కానీ, ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. ఇది దాదాపు 40 సంవత్సరాల క్రితం అంటే 1986లో యూరేనస్‌ను దాటుకొని నాసాకు చెందిన వాయేజర్ – 2 అంతరిక్ష నౌక ప్లైంబై సమయంలో చూడని విషయం అని అన్నారు. అయితే, ప్రస్తుతం గుర్తించిన ఈ చంద్రుడు యురేనస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని, గ్రహ కేంద్రం నుండి దాదాపు 35వేల మైళ్లు (56వేల కిలోమీటర్లు) దూరంలో ఈ చంద్రుడు తిరుగుతున్నాడని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇది యురేనస్ ప్రధాన వలయాల వెలుపల ఉన్న ఒఫెలియా, బియాంకా కక్ష్యల మధ్య ఉంది.
29వ చంద్రుడిని కనుగొన్న నాసా - పేరు ఎస్/2025 యూ1
August 23, 2025
0
Tags