2- 2తో డ్రాగా ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ సిరీస్

Telugu Lo Computer
0


వల్ లో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. 374 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 367 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలతో పోరాడినా భారత బౌలర్లు విజృంభించడంతో గిల్ సేనకు విజయం వరించింది. ఈ టెస్టులో 9 వికెట్లు తీసిన మొహమ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చివరి టెస్టులో భారత్ విజయం సాధించడంతో ఆండర్సన్-టెండూల్కర్ సిరీస్ 2- 2తో డ్రాగా ముగిసింది. భారత బౌలర్లు 29 పరుగులే ఇచ్చి చివరి నాలుగు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 224 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ చేసిన 57 పరుగులే ఆ ఇన్నింగ్స్‌లో అత్యధికం. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 396 పరుగులు సాధించి, ఇంగ్లండ్‌కు 374 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. సిరాజ్ ఐదు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. చివరి టెస్టు విజయంతో భారత్ సిరీస్‌ను 2- 2తో డ్రా చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)