గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి సరికొత్త రికార్డ్ సృష్టించిన 10 ఏళ్ల చిన్నారి బోధనా శివానందన్

Telugu Lo Computer
0


బ్రిటిష్ చెస్ చాంపియన్‌షిప్‌ 2025లో  10 ఏళ్ల చిన్నారి బోధనా శివానందన్ గ్రాండ్‌మాస్టర్ పీటర్ వెల్స్ (వయసు 60) ను ఓడించి చెస్ ప్రపంచానికి షాక్‌ ఇచ్చింది. దీంతో చరిత్రలో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అత్యంత చిన్న వయస్కురాలిగా తన పేరు లిఖించుకుంది. భారత సంతతికి చెందిన బోధనాకు చెస్ పట్ల ఆసక్తి ఎలా వచ్చిందంటే, ఆమెకు 5 ఏళ్ల వయసులో ఒక చెస్ సెట్ బహుమతిగా లభించింది. అందులో తనకు క్వీన్స్ బాగా నచ్చాయంటా. అప్పటి నుంచే తన నాన్న సహకారంతో ఆట నేర్చుకున్నట్లు బోధనా తెలిపింది. దీంతోపాటు యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ నేర్చుకుంది. ఆ తర్వాత ఆమె స్థానిక టోర్నమెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. అలా ఆమె టాలెంట్ వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు భారతదేశంలోని తమిళనాడు తిరుచిరాపల్లికి చెందిన వారు కాగా, ప్రస్తుతం లండన్‎లో ఉంటున్నారు. ఆగస్ట్ 10, 2025న లివర్‌పూల్‌లో జరిగిన బ్రిటిష్ చెస్ చాంపియన్‌షిప్‌లో చివరి రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్ పీటర్ వెల్స్‌ను బోధనా ఓడించింది. ఆ రోజున ఆమె వయసు 10 సంవత్సరాలు, 5 నెలలు, 3 రోజులు. అంతకుముందు అమెరికన్ చెస్ ప్లేయర్ కారిస్సా యిప్ 2019లో 10 సంవత్సరాలు, 11 నెలలు, 20 రోజుల్లో ఒక గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించింది. ఇప్పుడు బోధనా ఆ రికార్డును బ్రేక్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)