ఉప్పాడలో తీరప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దీని కోసం ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సీఎం ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. రూ.323 కోట్లతో రక్షణ నిర్మాణాల విషయాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ పరిశీలిస్తోందన్నారు. ''కాకినాడ ప్రజల ఆకాంక్షలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గుర్తిస్తారని విశ్వసిస్తున్నా. ఏటా కోత వల్ల 12 మీటర్ల వరకు నష్టం వాటిల్లుతోంది. తీరప్రాంత గ్రామాలు, మత్స్యకారుల ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.'' అని పవన్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)