భారీ వరదలోనూ దూసుకొచ్చిన థార్ : తన బ్రాండ్‌ సియెట్ టైర్లును ప్రమోట్ చేసుకున్న హర్ష్ గోయెంకా

Telugu Lo Computer
0


హర్ష్ గోయెంకా తమ కంపెనీ బ్రాండ్సియెట్ టైర్లును ప్రమోషన్ కోసం వేరే కంపెనీ వాహనం వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియోలో మహీంద్రా కంపెనీకి చెందిన థార్ ఎస్‌యూవీ వరద నీటిలో దూసుకొచ్చింది. ఇంజిన్ మొత్తం మునిగేలా ఉన్న నీటిలోనూ మహీంద్రా థార్ వాహనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ఒడ్డుకు చేరినట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యాలను పలువురు వీడియోలు తీస్తున్నట్లు కనిపిస్తోంది. అంత భారీ వరద నీటిలోనూ థార్ ఎస్‌యూవీ దూసుకురావడంపై పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ హర్ష్ గోయెంకా తమ కంపెనీ బ్రాండ్ ప్రమోట్ చేసుకున్నారు. నిజమైన వ్యాపారవేత్త అని నిరూపించుకున్నారు. 'మహీంద్రా ఎస్‌యూవీ ఒక మంచి బలమైన టైర్‌తో (నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైందని భావిస్తున్నా) కలిసి ఉన్నప్పుడు అది అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ఇది చూసి నమ్మండి' అంటూ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన పోస్టుకు పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. మీరు మాట్లాడేది సియెట్ టైర్ గురించేనా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దానికి అవుననే చెప్పాలి. ఎందుకంటే, హర్ష్ గోయెంకా ఛైర్మన్‌గా ఉన్న ఆర్‌పీజీ గ్రూప్‌లో సియెట్ బ్రాండ్‌తో టైర్లు తయారు చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా ఆయన సియెట్ టైర్లను ప్రమోట్ చేసినట్లు అర్థమవుతోంది. సియెట్ లిమిటెడ్ అనేది భారతీయ టైర్ల తయారీ కంపెనీ. ఇది ఆర్‌పీజీ గ్రూప్ లో ఒక భాగం. అయితే, దీనిని తొలుత 1924లో ఇటలీలో ప్రారంభించారు. టాటా గ్రూప్ భాగస్వామ్యంతో 1958లో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారతీయ విభాగాన్ని 1982లో ఆర్‌పీజీ గ్రూప్ కొనుగోలు చేసింది. 1990లో సియెట్ లిమిటెడ్‌గా అధికారికంగా పేరు మార్చారు. ఇప్పుడు దేశీయ ప్రముఖ టైర్ బ్రాండ్లలో ఒకటిగా సియెట్ కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)