తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే ముత్తు చెన్నయ్‌లోని ఇంజంబాకంలో ఉన్న తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. కరుణానిధి మొదటి భార్య పద్మావతికి ముత్తు జన్మించారు. ఆయన పుట్టిన కొన్ని రోజులకే అనారోగ్యంతో ఆమె మరణించారు. తమిళ సినీరంగంలో నటుడిగా, గాయకుడిగా ముత్తు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఆశించిన సక్సెస్ దక్కకపోవడంతో ఆ రంగానికి దూరమయ్యారు. ముత్తు మరణవార్త విన్న ఆయన సోదరి కనిమొళి, సీఎం స్టాలిన్, ఉదయనిధి హుటాహుటిన ఇంజంబాకం చేరుకున్నారు. అనంతరం శనివారం సాయంత్రం ముత్తు అంత్యక్రియలు నిర్వహించారు.
కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే ముత్తు కన్నుమూత
July 20, 2025
0
Tags