బంగ్లాదేశ్‌ లో ముంచుకొస్తున్న మత ఛాందసవాద శక్తుల ప్రమాదం

Telugu Lo Computer
0

బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తర్వాత, దేశంలోనూ, వెలుపలా ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది. మహ్మద్ యూనస్ ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్ మత ఛాందసవాద శక్తులను ప్రోత్సహిస్తోంది. ప్రపంచ దేశాలతో బంగ్లాదేశ్ సంబందాలు పెరుగుతుండటంతో సరిహద్దులో భారతదేశం పట్ల ఆందోళనను పెంచింది. బంగ్లాదేశ్ నిపుణులు కూడా ఈ ప్రమాదం గురించి భారతదేశాన్ని హెచ్చరించారు. బంగ్లాదేశ్ ముస్లిం దేశంగా మారితే ఇప్పుడు పాకిస్తాన్ తరహాలోనే బంగ్లాదేశ్ నుంచి కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు బంగ్లాదేశ్ భారత్ వైఖరిని తప్పుబడుతుంది. ద్వేషాన్ని పెంచుకుంటుంది. బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇండియా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సలావుద్దీన్ షోయబ్ చౌదరి భారతదేశాన్ని హెచ్చరించారు. మహ్మద్ యూనస్ ఇదే మార్గంలో కొనసాగితే, బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం వుందని ఆయన అన్నారు. ఇప్పటికే బంగ్లాదేశంలో హిందూవులపై, హిందూ దేవాలయాలపై దాడులు పెరుతున్నాయి. మొత్తం ప్రాంతంలో అస్థిరత వ్యాపిస్తుంది. భారతదేశం ముఖ్యంగా దీని ప్రభావానికి గురవుతుంది. ఎందుకంటే రెండు దేశాలకు ఉమ్మడి సంస్కృతి ఉంది. గత 11 నెలల్లో యూనుస్ ప్రభుత్వం భద్రతా వ్యవస్థలో పెద్ద మార్పులు చేసిందని షోయబ్ చౌదరి చెప్పారు. రాడికల్ ఇస్లాం నేపథ్యం ఉన్న పోలీసులు, సరిహద్దు గార్డు, కోస్ట్ గార్డులలో 17 వేల మంది కొత్త వ్యక్తులను నియమించారు. లౌకిక ప్రజాస్వామ్య విలువలకు ప్రసిద్ధి చెందిన బంగ్లాదేశ్, ఇప్పుడు మొహమ్మద్ యూనుస్ పాలనలో బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్ గా మారుతుందని ఆయన వివరించారు. ఎలాంటి అర్హతలు చూడకుండా యూనస్ కేవలం ముస్లీం వ్యక్తులను సైన్యంలో ఉన్నత పదవుల్లో నియమించాడు. యూనస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ మార్పులు బంగ్లాదేశ్ భద్రతా వ్యవస్థలో ఇస్లామీకరణ జరుగుతోందని అర్ధమవుతోంది. బంగ్లాదేశ్ దేశానికి పాకిస్తాన్, టర్కీలతో దౌత్యసంబంధాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ఆ దేశాలు సాయం చేస్తున్నాయి. ఈ నెలలో బంగ్లాదేశ్ అంతర్జాతీయ ముస్లిం ఎన్జీవోల సమూహానికి ఆతిథ్యం ఇచ్చింది. దీని గురించి మొహమ్మద్ యూనస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ముస్లిం ప్రపంచాన్ని ఏకం చేయడమే ఈ సమావేశం ఉద్దేశ్యం అని స్పష్టంగా రాశారు. టర్కీ, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా నుండి ఇస్లామిక్ సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి.  బంగ్లాదేశ్ లో కూడా టర్కీ ప్రభావం పెరుగుతోంది. టర్కీ రక్షణ పరిశ్రమ కార్యదర్శి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ను కలిశారు. దీనిలో టర్కీ బంగ్లాదేశ్ కు కలిసి సైనిక పరికరాలను తయారు చేయాలని ప్రతిపాదించింది. ఎర్డోగన్ భావజాలాన్ని బంగ్లాదేశ్ లోనే కాకుండా దక్షిణాసియాలో వ్యాప్తి చేయడానికి ఇది ఒక ప్రయత్నంగా భావిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)