హైదరాబాద్ బేగంపేటకు చెందిన సబిల్ హత్య కేసును మెదక్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఇవాళ ఈ కేసుకి సంబంధించిన వివరాలను మీడియాకు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు. శివ్వంపేట మండలం మగ్ధంపూర్‌లో ఈనెల 21వ తేదీన సాబిల్ హత్య జరిగింది. బోరబండలో ఓ గ్యారేజీలో పనిచేస్తున్నాడు సబిల్ తాను పని చేసే గ్యారేజీ ఓనర్ కూతురుని ప్రేమించాడు. ఫొటోలు చూపించి తనను పెళ్లి చేసుకోవాలని యువతి కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేయకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకి దిగాడు. మాట్లాడుదామని చెప్పి సబిల్‌ను మగ్ధంపూర్‌కు యువతి బంధువులు అప్సర్, సంతోష్ తీసుకు వచ్చారు. ఫొటోలు ఫోన్‌లో నుంచి డిలీట్ చేయాలని సబిల్‌ని యువతి బంధువులు అప్సర్, సంతోష్ కోరగా సబిల్ అందుకు నిరాకరించాడు. దాంతో సబిల్‌ను హత్య చేశారు యువతి బంధువులు అప్సర్, సంతోష్. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.
సబిల్ హత్య కేసును ఛేదించిన మెదక్ జిల్లా పోలీసులు
July 24, 2025
0
Tags