బిళ్ళగన్నేరు - ఆరోగ్య ప్రయోజనాలు

Telugu Lo Computer
0


బిళ్ళగన్నేరులో ఔషధ గుణాలు అసాధారణమైనవి. అందుకే దీన్ని "నడిచే మెడికల్ స్టోర్" అని కూడా పిలుస్తారు. ఈ మొక్క అనేక వ్యాధులకు సహజ చికిత్స. దీని ఆకులు, పువ్వులు, వేర్లు రామబాణంలా పనిచేస్తాయి. బిళ్ళగన్నేరు ఆకుల్లో ఉండే విన్‌క్రిస్టీన్, విన్‌బ్లాస్టీన్ అనే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఆల్కలాయిడ్లు మధుమేహ సమస్యను సమర్థంగా నియంత్రిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. బిళ్ళగన్నేరు ఆకులు, పువ్వులతో తయారు చేసే కషాయం లేదా రసం తాగడం వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రక్తపోటు సమతుల్యతను కాపాడుతాయి. గొంతునొప్పి, మంట సమస్యలకు ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సమస్యలు, మొటిమలు, మచ్చలకు బిళ్ళగన్నేరు ఆకుల పేస్ట్ బాగా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదల కోసం దీని ఆకుల రసం ఉపయోగా చేస్తారు. చుండ్రు తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. వాపు సమస్యల్ని తగ్గించడంలో ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పనిచేస్తాయి. తాజా ఆకులను నేరుగా నమిలినా, నీటిలో ఉడికించి కషాయం తయారు చేసుకుని తాగినా, ఎండబెట్టిన ఆకుల పొడి తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఆకులు నమిలితే మంచిది. వీటిని గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోకూడదు. అలాగే మితిమీరిన మోతాదు హానికరం. తప్పనిసరిగా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకుని మాత్రమే వినియోగించాలి.


Post a Comment

0Comments

Post a Comment (0)