మహారాష్ట్రలోని థానే, సాగర్ నగర్‌లో ఏక్‌నాథ్ శిండే వర్గానికి చెందిన శివసేన నేత పార్కింగ్ విషయంలో సిబ్బందితో గొడవకు దిగాడు. వాగ్వాదానికి దిగి వారిపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన వెంట తీసుకువచ్చిన భారీ కత్తిని బయటకు తీసి అక్కడి వారిని బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాడికి పాల్పడిన నిందితుడిని శిండే వర్గం శివసేన పార్టీలోని ఓ విభాగానికి అధ్యక్షుడు అయిన ఆకాశ్ భలేరావ్‌గా గుర్తించారు. అతడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శివసేన శిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఇటీవల ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో క్యాంటీన్ సిబ్బందితో గొడవకు దిగారు. పప్పు వాసన వస్తోందని కార్మికుడిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.
పార్కింగ్ విషయంలో గొడవ : కత్తితో వీరంగం సృష్టించిన శిండే వర్గానికి చెందిన శివసేన నేత
July 23, 2025
0
Tags