సిగాచి పరిశ్రమను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల కమిటీ

Telugu Lo Computer
0


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్‌ పేలి 40 మంది వరకూ మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నిపుణుల కమిటీ బృందం సిగాచి పరిశ్రమలో ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. మూడున్నర గంటల పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీసింది. పేలుడు తర్వాత సేఫ్టీ వాల్వ్‌ పని చేసిందా?, చేయలేదా అనే దానిపై నిపుణుల కమిటీ ప్రధానంగా పరిశీలించింది. దీంతో పాటు అసలు పరిశ్రమలో తయారీకి తీసుకున్న అనుమతి ఏంటి?, తయారు చేస్తున్నదేంటి అన్న కోణంలో సైతం విచారణ చేపట్టింది నిపుణుల కమిటీ బృందం. పరిశ్రమ ఏర్పాటు చేసిన 30 ఏళ్లలో ఇప్పటికి ఎన్నిసార్లు మిషనరీ మార్చారో నిపుణులు కమిటీ తలుసుకుంది. చివరిగా పరిశ్రమలో సెఫ్టీ తనిఖీలు ఎప్పుడు చేశారు..? అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ నిపుణుల కమిటీ విచారణ చేస్తుంది

Post a Comment

0Comments

Post a Comment (0)