తప్పుడు ప్రిస్క్రిప్షన్లు ఇవ్వాలంటే తన లైంగిక వాంఛలు తీర్చాలని ఒత్తిడి చేసిన డాక్టర్‌ రితేష్ కల్రా అరెస్టు

Telugu Lo Computer
0


మెరికా లోని న్యూజెర్సీలో తప్పుడు ప్రిస్క్రిప్షన్లు ఇవ్వాలంటే తన లైంగిక వాంఛలు తీర్చాలని ఒత్తిడి చేసినట్లు సెకాకస్‌కు చెందిన 51 ఏళ్ల డాక్టర్‌ రితేష్ కల్రాపై పలువురు పేషెంట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, యూఎస్‌ కోర్టులో విచారణ అనంతరం అతడిని గృహ నిర్బంధంలో ఉంచినట్లు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్‌ రితేష్ కల్రా న్యూజెర్సీలోని సెకాకస్‌ ప్రాంతంలో ఫెయిర్ లాన్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అయితే అవసరం లేకుండానే అతడు తన క్లినిక్‌లో ఆక్సికోడోన్ వంటి శక్తిమంతమైన డ్రగ్స్‌ను పేషెంట్లకు ఇస్తుండేవాడు. ఈ విధంగా అతడు 2019 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 31,000 కంటే ఎక్కువ ఆక్సికోడోన్ ప్రిస్క్రిప్షన్‌లను పేషెంట్లకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వాటికి అలవాటు పడిన వారు మరిన్ని మందులు కావాలని సంప్రదించేవారు. దీంతో ప్రిస్క్రిప్షన్‌ ఇవ్వాలంటే తన లైంగిక కోరికలు తీర్చాలని మహిళా పేషెంట్లను బలవంతం చేసేవాడని అధికారులు తెలిపారు. తమతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక దాడికి పాల్పడ్డాడని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చర్యల ద్వారా అతడు చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా అధిక మోతాదు డ్రగ్స్‌ ఇచ్చి రోగుల ప్రాణాలకు ముప్పు కలిగించాడని అధికారులు పేర్కొన్నారు. దీంతో రితేష్ కల్రా వైద్య లైసెన్స్‌ను సస్పెండ్ చేసినట్లు యూఎస్‌ కోర్టు వెల్లడించింది. అతడు తన క్లినిక్‌ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. అతడు దోషిగా తేలితే దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)