గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్ సీఈఓ కాన్రాడీను తొక్కి చంపిన ఏనుగు

Telugu Lo Computer
0


క్షిణాఫ్రికాలోని గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్ సీఈఓ ఎఫ్‌సి కాన్రాడీ పని చేస్తున్నారు. కైలిక్స్ గ్రూప్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీకి కూడా యజమాని. అయితే ఏకో టూరిజంలో కాన్రాడీ అందరికీ సుపరిచితులు కాగా మొదటి నుంచి ఆయనకు ఏనుగులు, ప్రకృతి పట్ల అమితమైన ప్రేమ ఉండేది. జంతుశాస్త్రం, జంతు అధ్యయనాలు, వాణిజ్యం, మార్కెటింగ్ వంటి విభాగాలలో ఆయన గౌరవ డిగ్రీలు కూడా పొందారు. ఈక్రమంలోనే గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజజర్వ్‌ను స్థాపించారు. ఇక్కడ ఫైవ్ స్టార్ సఫారీ లాడ్జిని కూడా ఏర్పాటు చేశారు. అది మాత్రమే కాకుండా బిగ్ ఫైవ్ (ఆఫ్రికా సింహం, ఏనుగు, చిరుతపులి, కేప్ బఫెలో, ఖడ్గమృగం)ను చూసిన అనుభూతి కోసం ఇక్కడకు పెద్ద ఎత్తున ప్రముఖులు, పర్యాటకులు వస్తుంటారు. ఈక్రమంలోనే సీఈఓ కాన్రాడీ కూడా ఎక్కువగా అక్కడకు వచ్చి రోజువారీ కార్యాకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ఎప్పటిలాగే మంగళవారం టూరిస్టు లాడ్జిలకు దూరంగా ఏనుగుల గుంపును తోలుతుండగా ఒకటి మాత్రం విపరీతంగా ప్రవర్తించి పక్కనే ఉన్న కెన్రాడీని తన దంతాలతో నెట్టి, పలుమార్లు తొక్కి చంపింది. రేంజర్లు కాపాడేందుకు విపరీతంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ ముందే తమ సీఈఓ ప్రాణాలు కోల్పోయారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. 2023 మార్చిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)