'హరి హర వీరమల్లు' సినిమా మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జ్యోతికృష్ణ దీన్ని పూర్తి చేశారు. తాజాగా క్రిష్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ త్వరలోనే ఇందుకు గల కారణాలు బయటకు వస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పవన్‌తో తనకు విభేదాలు లేవని కూడా క్రిష్ స్పష్టంచేసినట్లు మీడియా సంస్థ పేర్కొంది. 'నాకు, పవన్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు కూడా లేవు. నేను ఓపెన్‌గా ఉన్నాను. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేసేందుకు కూడా సిద్ధమే' అని క్రిష్ తెలిపినట్లు మీడియా సంస్థ పేర్కొంది. ఇటీవల 'హరి హర వీరమల్లు' సినిమా విడుదలకు ముందు కూడా పవన్‌పై ప్రశంసలు కురిపిస్తూ క్రిష్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తి కావడానికి పవన్, ఏఎం రత్నం కారణమంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'హరి హర వీరమల్లు' ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు వసూలు చేసింది. తొలిరోజే వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఈ వీకెండ్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
పవన్ కల్యాణ్‌తో ఎలాంటి విభేదాలు లేవు: క్రిష్ జాగర్లమూడి
July 26, 2025
0
Tags